News April 17, 2025

ఉమ్మడి కరీంనగర్ వాసులు.. వీటిలో ఎక్కడికి వెళ్తున్నారు? 1/2

image

ఏప్రిల్, మే నెలలో వేసవి సెలవుల్లో సందర్శించడానికి ఉమ్మడి KNR జిల్లాలో సుందరమైన <<16117241>>పర్యాటక<<>> ప్రాంతాలు, ఆలయాలు అందుబాటులో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఇల్లందకుంట రామాలయం, ఓదెల మల్లికార్జనస్వామి, నాంపల్లి నరసింహస్వామి, కాళేశ్వరం, కోటి లింగాల, కొత్తకొండ వీరభధ్రస్వామి, పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి, రాయికల్‌లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు ఉన్నాయి.

Similar News

News December 22, 2025

KNR: పత్తి రైతుకు మళ్లీ ‘ధర దెబ్బ’..!

image

కరీంనగర్ జిల్లాలో పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ.50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ.50 తగ్గించగా, తాజాగా మరో రూ.50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010 కి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 21, 2025

ఈనెల 24 నుంచి ‘కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా’

image

కరీంనగర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 21, 2025

ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

image

ఉమడి KNR జిల్లా స్థాయి మైనారిటీ బాలికల పాఠశాలల & కళాశాలల క్రీడా పోటీలు KNR జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల చొప్పదండి బాలికలు -1, గంగాధర కైవసం చేసుకుంది. ఈ పోటీలకు వివిధ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల&కళాశాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.