News March 2, 2025
ఉమ్మడి కరీంనగర్: 4 నుంచి 6 వరకు ట్రైనింగ్

DSC 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, LP, PD, PETలకు ఈనెల 4నుంచి 6వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్కు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్కి వచ్చే టీచర్లు వారివెంట పాఠ్య పుస్తకాలు తీసుకొని రావాలని చెప్పారు.
Similar News
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.
News October 19, 2025
విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

విజయవాడ భవాని ఐలాండ్లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.