News May 3, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.
Similar News
News November 7, 2025
విద్యాసంస్థలకు రేపు సెలవు లేదు: డీఈవో

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత నెల 29న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో పనిదినాలు అమలుపరచడంలో భాగంగా రేపు అన్ని స్కూళ్లు ఉంటాయని డీఈవో శామ్యూల్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News November 7, 2025
బస్సుల్లో భద్రతా తనిఖీలు ముమ్మరం

ఇటీవల బస్సు ప్రమాదం నేపథ్యంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రాత్రిపూట తిరిగే బస్సులు, లారీలు, తదితర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వాహన పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు పరిశీలిస్తూ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో, లేదో చెక్ చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ‘ఫ్రెష్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించించి, నిద్ర మత్తు వదిలిస్తున్నారు.
News November 7, 2025
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: ఎస్పీ

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో పోలీసు అధికారులు స్కూల్, కళాశాలల్లో అవగాహన కల్పించారు. ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని సూచించారు.


