News October 7, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!

ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
Similar News
News January 10, 2026
టీచర్‌గా మారిన కర్నూలు కలెక్టర్

కల్లూరు మండల పర్యటనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి టీచర్‌గా మారారు. మండల పరిధిలోని పందిపాడులో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. పిల్లలతో కూర్చుని ప్రీ స్కూల్ విద్యలో వారి సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం కలెక్టర్ చేయడంతో చిన్నారులు మంత్రముగ్ధులు అయ్యారు.
News January 10, 2026
ఒర్ణబ్ తుఫాన్ హెచ్చరిక

ఈ నెల 10 నుంచి ఒర్ణబ్ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకొచ్చే రైతులు పంట ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లు కప్పుకుని రావాలని సూచించారు. యార్డులోకి వచ్చిన సరుకును షెడ్లలో లేదా షాపుల ముందు భాగంలో భద్రంగా ఉంచుకోవాలన్నారు.
News January 10, 2026
నైపుణ్యం పోర్టల్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కర్నూలు కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం పోర్టల్‌లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రిజిస్ట్రేషన్లు, AI ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ కనెక్ట్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 5000 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని. యువతకు ఉపాధి కల్పించేలా ఏఐ ఇంటర్వ్యూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.


