News October 7, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!
ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
Similar News
News November 13, 2024
యురేనియం తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యే కట్టుకథ: పత్తికొండ ఎమ్మెల్యే
దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అన్నది వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి కల్పించిన కట్టు కథ అని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతిలోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ యురేనియం తవ్వకాలపై వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలు జరిగే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు.
News November 13, 2024
పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం
ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 12, 2024
BIG NEWS: యురేనియం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.