News March 28, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు

ఏపీలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి నలుగురికి అవకాశం వరించింది. వారిలో నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అంగజాల గీత, పత్తికొండ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నబి సాహెబ్, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కురువ మల్లయ్య ఉన్నారు.
Similar News
News February 26, 2026
ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్త బదిలీ

రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్తను ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారిగా ఖుష్బూ గుప్త మహిళ స్వయం సంఘాల అభివృద్ధి ఉపాధి కల్పన తదితర అంశాలపై జాతీయస్థాయిలో అవార్డును సైతం పొందారు. అనంతరం వ్యక్తిగత సెలవులపై వెళ్లిన పిఓ స్థానంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పిఓ వ్యవహరిస్తున్నారు..
News February 26, 2026
వరంగల్: IASల బదిలీ.. ఖాళీగానే ‘కీలక’ పోస్టులు..!

ఉమ్మడి జిల్లాలో కీలక అధికారిక పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్ర కరీంనగర్ కలెక్టర్‌గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు GWMC కమిషనర్‌గా రెగ్యులర్ అధికారిని నియమించకుండా, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. జనగామ అదనపు కలెక్టర్ స్థానం సైతం ఖాళీ అయ్యింది.
News February 26, 2026
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఫణీంద్ర రెడ్డి

నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా జి. ఫణీంద్ర రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGMSIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించిన ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. త్వరలోనే ఆయన జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.


