News April 21, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.
Similar News
News February 25, 2026
ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.
News February 25, 2026
డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయండి: ఎస్పీ

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెంచి, డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేర నియంత్రణకు మరింత పటిష్ఠంగా పనిచేయాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 25, 2026
కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోండి: MP

రాష్ట్రంలో కల్తీ పాల అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తిరుపతి MP గురుమూర్తి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అంగన్వాడీలు, డెయిరీలు, హోటళ్లు, స్వీట్లు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించాలని ఆదేశించారు. కల్తీ నిర్ధారణైతే చర్యలు తీసుకోవాలని, పునరావృతమైతే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


