News April 10, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News December 1, 2025

జగిత్యాల: గ్రీవెన్స్ డేలో అర్జీదారులకు భరోసా ఇచ్చిన ఎస్పీ

image

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరుగునట్లు చూడాలని తెలిపారు.

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.

News December 1, 2025

అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

image

దిత్వా తుఫాను కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 శాతం కూడా వరి కోత అవలేదని, వరి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు.