News March 22, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా TDP MP అభ్యర్థులు వీరే..

image

టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును ప్రకటించింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.

Similar News

News September 12, 2024

ఉపాధి హామీలో 25వ స్థానం: కర్నూలు కలెక్టర్

image

ఉపాధి హామీ పనుల కల్పనలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అసహనం వ్యక్తం చేశారు. తుగ్గలి మండలంలో గతవారం జీరో శాతం నమోదుపై సంబంధిత అధికారులందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఉపాధి హామీ, హౌసింగ్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వెల్దుర్తి, కృష్ణగిరి, కర్నూలు, ఓర్వకల్ మండలాల్లో పనులు కల్పించడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు.

News September 11, 2024

డోన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

డోన్ పట్టణం పాతపేరు ద్రోణపురి. పాండవుల గురువైన ద్రోణాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరి దారి మధ్యలో ఈ ప్రాంతంలోని కొండలపై కొంత సమయం బస చేస్తాడట. అందుకు గుర్తుగానే ఈ ప్రాంతానికి ద్రోణపురి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో ఈ పట్టణం డోన్‌గా స్థిర పడింది. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

News September 11, 2024

చందలూరులో కుళాయి గుంతలో పడి బాలుడి మృతి

image

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో కుళాయి గుంతలో పడి గౌతమ్ (5) అనే బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు గౌతమ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుళాయి కోసం తీసిన గుంతలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతి చెందాడు. గుంతలను పంచాయతీ అధికారులు పూడ్చకపోవడంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.