News February 26, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదుగురు డీఎస్పీల బదిలీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. బదిలీ అయిన వారిలో సౌత్ ఏసీపీ పవన్ కుమార్, ఎస్బీ ఏసీపీ భాను, అవనిగడ్డ డీఎస్పీ విద్య శ్రీ, మచిలీపట్నం డీఎస్పీ రాజా, గుడివాడ డీఎస్పీ వినీల్ ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News April 18, 2026

సదుం: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో సదుం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకువారి పల్లెకి చెందిన ధరణి తమిళనాడు రాష్ట్రం మధురైలో బీటెక్ చదువుతున్నాడు. గత శనివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

News April 18, 2026

VZM: విద్యుత్ తీగలు తగిలి కార్మికుడి దుర్మరణం

image

పూసపాటిరేగ మండలంలోని తొత్తడాం గ్రామానికి చెందిన రాయి లక్ష్మణరావు (45) శుక్రవారం విద్యుత్ పనులు చేస్తూ దుర్మరణం పాలయ్యారు. గోవిందపురంలో ఓ కొత్త ఇంటికి లైన్ వేస్తుండగా ఇనుప నిచ్చెన, తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆయన భార్య, కుమార్తెల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2026

చర్చకు సిద్ధమా? పవన్‌కు ప్రకాశ్‌రాజ్ సవాల్

image

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్‌పై ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్‌కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.