News July 29, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

1.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం: జేసీ నవీన్

image

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు సంబంధించి 29,866 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.502.50 కోట్లు చెల్లించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోపే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 72,98,622 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

News December 7, 2025

కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

image

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.

News December 7, 2025

2.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ

image

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తం 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందని జేసీ నవీన్ తెలిపారు. గత ఏడాది ఇదే రోజుకి 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,46,473 మెట్రిక్ టన్నులు RSKల ద్వారా సేకరించినట్లు తెలిపారు. మొత్తం 29,668 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొని 48 గంటల్లో నగదు జమ చేశామన్నారు.