News January 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్‌లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 11, 2025
గోదావరి జిల్లాల నుంచి వచ్చే చికెన్ తీసుకోవద్దు: కృష్ణా కలెక్టర్

ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తీసుకోవల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే కోడి మాంసం, కోడి గుడ్లను తీసుకోవద్దన్నారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టామన్నారు.
News February 11, 2025
గన్నవరం: మాయమాటలతో బాలికను లోబర్చుకున్న ఆటో డ్రైవర్

ఇంటర్ చదివే విద్యార్థిని(మైనర్ బాలిక)ని రోజూ తన ఆటోలో కాలేజీకి తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ మాయ మాటలతో లోబర్చుకుని గర్భిణిని చేసిన ఘటన గన్నవరం మండలంలో చోటు చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సాంబయ్య అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.