News December 4, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు రాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. నూజివీడులోని కోనేరుపేటలో భూప్రకంపనలు వచ్చాయి. నిమిషం పాటు భూమి కంపించడంతో ఇల్లు మొత్తం కదిలి, సామాను చిందర వందర అయినట్లు స్థానికురాలు మస్తాన్ బీ Way2Newsతో చెప్పారు. ఇటు VJA, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలోనూ భూకంపం వచ్చింది.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


