News June 5, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులపైన అత్యధిక మెజారిటీ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.

Similar News

News December 5, 2025

సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

image

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

News December 5, 2025

పైడమ్మ జాతర రెండో రోజు.. సిద్ధమవుతున్న శిడిబండ్లు.!

image

పెడనలో పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు శుక్రవారం శిడిబండ్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర రెండో రోజు కాపుల వీధి నుంచి విశేషంగా మొత్తం 11 శిడిబండ్లు అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి బయలుదేరనున్నాయి.

News December 5, 2025

ఉయ్యూరు కేసీపీలో క్రషింగ్‌ షురూ

image

ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా యాజమాన్యం నిర్ణయించింది.