News May 23, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం

రేపు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్‌ఏఎస్‌సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 9, 2025
కృష్ణా: డీఈఓ బదిలీ.. నూతన డీఈఓగా సుబ్బారావు

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బదిలీ అయ్యీరు. పల్నాడు జిల్లాకు రామారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యూవీ సుబ్బారావును నియమించారు. సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం డీవైఈఓగా విధులు నిర్వర్తించారు. సౌమ్యుడుగా, వివాదరహితునిగా సుబ్బారావు పేరు తెచ్చుకున్నారు.
News December 9, 2025
గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.


