News June 4, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు వర్షాలు

image

రేపు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

Similar News

News January 9, 2026

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

image

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

News January 8, 2026

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.

News January 8, 2026

కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.