News August 20, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాల కలవరం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, అతిసార కేసుల వివరాలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల DMHOలు ఎం.సుహాసినీ, జి.గీతాబాయి వివరించారు. జూన్, జులై నెలల్లో మలేరియా, డెంగీ- 300,టైఫాయిడ్-800+, అతిసారం కేసులు 208 నమోదయ్యాయన్నారు. విషజ్వరాలు నిర్ధారించిన ప్రాంతాల్లో 50 మీటర్ల పరిధిలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 8, 2024

NTR జిల్లాలో వారికి మాత్రమే సెలవు: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వరద ముంపునకు గురైన లేదా పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తోందని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News September 8, 2024

దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్

image

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

News September 8, 2024

వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం

image

అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.