News November 27, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?

image

ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కనకమేడల రవీంద్ర రాజ్యసభ ఎంపీగా పనిచేయగా.. ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్‌తో ముగిసింది. జిల్లా నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మరికొంతమందిని రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కాగా ఈ 3 పదవులను NDA కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వనుందో మరికొద్ది రోజులలో తెలియనుంది.

Similar News

News December 14, 2024

నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు. 

News December 14, 2024

నేడు డోకిపర్రు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి రానున్నారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొంటారు. 

News December 13, 2024

ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు: వనితా రాణి

image

ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు.