News January 10, 2026
ఉమ్మడి ఖమ్మంలో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

రానున్న పురపాలక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం HYDలో నిర్వహించిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయని ధ్వజమెత్తారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, ప్రగతి మాత్రం శూన్యమని విమర్శించారు.
Similar News
News January 18, 2026
నా జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకం: CM

మేడారం వేదికగా సమ్మక్క – సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని సీఎం పేర్కొన్నారు.
News January 18, 2026
‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్ వెల్లడించింది.
News January 18, 2026
HYD: పట్నం వచ్చినా.. మదిలో మాత్రం పల్లె జ్ఞాపకాలే!

ఉపాధి కోసం HYD బాట పట్టిన జనం, పండుగ రాగానే ఊరువైపు పరుగులు పెడతారు. పట్నంలో పరుగు తీసిన కష్టాన్ని మరిచే ఆనందం, పండగకు పల్లెల్లోనే దొరుకుతుందని చెబుతుంటారు. అమ్మ వంట, నాన్న ఆశీర్వాదం, బంధువుల ఆప్యాయత ఇవన్నీ పండగకు ఊరే చిరునామా.. కాంక్రీట్ జంగల్ HYD జీవితంలోనూ పల్లె జ్ఞాపకాలే మనసుకు ఊరటనిస్తాయి. సంక్రాంతికి ఊరెళ్లి, మళ్లీ HYD బాట పట్టిన ప్రజలు ముచ్చటిస్తున్నారు.


