News March 8, 2025
ఉమ్మడి ఖమ్మంలో నాలుగు గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. పైలెట్ ప్రాజెక్టుగా మధిర మండలం మడుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. మడుపల్లిలో నాలుగు ఎకరాల్లో రూ.3.50 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా హైదరాబాదు నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News December 6, 2025
ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు.
News December 6, 2025
రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.
News December 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన


