News March 8, 2025

ఉమ్మడి ఖమ్మంలో నాలుగు గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. పైలెట్ ప్రాజెక్టుగా మధిర మండలం మడుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. మడుపల్లిలో నాలుగు ఎకరాల్లో రూ.3.50 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా హైదరాబాదు నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News March 18, 2025

కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

image

జడ్చర్ల మండలంలో <<15786400>>నవవధువు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్తమామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

News March 18, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఏన్కూర్: శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో వేలం పాట ∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు∆} మధిరలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పర్యటన

News March 18, 2025

ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

image

ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది

error: Content is protected !!