News March 20, 2025
ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
NZB: కారు డిక్కీలో మహిళ డెడ్బాడీ

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్లోని దాస్ నగర్ కెనాల్లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరిలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ముందుగా వెళ్లరాదని సూచించారు.
News March 28, 2025
2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

గురుగ్రామ్ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.