News February 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ

image

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌, KMM-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్, కిన్నెరసానిపై రెండో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.

Similar News

News November 24, 2025

రేపు పులివెందులలో జగన్ పర్యటన

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన ఒక వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి అరటి తోటలను సందర్శించి, లింగాల మాజీ సర్పంచి మృతి పట్ల కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత వేల్పులలో స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు.

News November 24, 2025

‘రైతన్న మీకోసం’ పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వ్యవసాయాధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ అధికారులు రోజుకు 90 మంది రైతుల ఇళ్లను సందర్శించి, వ్యవసాయంలో పంచ సూత్రాలు, అగ్రిటెక్‌లపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News November 24, 2025

రైజింగ్ స్టార్స్ కప్ గెలిచిన పాక్.. INDపై ట్రోల్స్!

image

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ విజేతగా PAK A నిలిచింది. ACC ఛైర్మన్ నఖ్వీ ఆ జట్టుకు ట్రోఫీ అందించగా, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తూ PAK ఫ్యాన్స్ టీమ్ ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. ‘పక్క దేశం వాళ్లకు ఇది ఇంకా నెరవేరని కలే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటికి IND ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. కాగా SEPలో ఆసియా కప్ గెలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు IND నిరాకరించిన సంగతి తెలిసిందే.