News October 23, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో ఫార్మా కౌన్సిలింగ్ ∆} ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
Similar News
News November 7, 2024
ఖమ్మం: పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 10 తేదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు డిపోల నుంచి పంచరామాలు, అన్నవరానికి వెళ్లే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. సీట్లు బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాల్సిందిగా కోరారు.
News November 7, 2024
KMM: వార్డు సభ్యుడిగా చేయాలన్నా పోటీనే!
కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది.
News November 7, 2024
పాకెట్ గైడ్ భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు దోహదం: భట్టి
పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజా భవన్ లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ను డిప్యూటీ సిఎం ఆవిష్కరించారు. పక్షుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.