News November 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ల సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
Similar News
News October 14, 2025
ఆన్లైన్ మోసం.. రూ.30 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

పార్ట్టైమ్ జాబ్, పెట్టుబడుల పేరుతో రూ.30 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి టెలిగ్రామ్లో పరిచయం అయ్యాడు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అశ చూపి రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయించి మోసగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేశారు.
News October 14, 2025
15న సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకానికి రాత పరీక్ష

రెండు సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకానికి ఈనెల 15న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.
News October 14, 2025
‘పంట కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి’

జిల్లాలో వానాకాలం సాగు ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ధాన్యం, పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు.