News November 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ల సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
Similar News
News December 2, 2024
మధిరలో ప్రజా విజయోత్సవాలు: కలెక్టర్
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నేడు మధిరలోని రెడ్డి రెడ్డి గార్డెన్స్‌లో సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News December 1, 2024
పాడి పశువుల పెంపకానికి చేయూత: భద్రాద్రి కలెక్టర్
పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.
News December 1, 2024
రైతు పండుగ విజయవంతం పట్ల తుమ్మలకు పీసీసీ చీఫ్ అభినందనలు
రైతు పండుగ కార్యక్రమం విజయవంతం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసంలో ఆదివారం పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. రైతాంగంకు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.