News November 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యంశాలు
> ఖమ్మం: ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం> > జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > > మంత్రి సీతక్క పర్యటన > > పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాక > > > ఆర్యవైశ్యుల వన సమారాధన > > > ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన > ఖమ్మం: రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > > నేడు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం వాయిదా
Similar News
News December 10, 2024
ఖమ్మం: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.
News December 10, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి:కలెక్టర్
ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
News December 9, 2024
‘ఖమ్మం జిల్లాలోని రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కారించాలి’
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతి అందజేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావులు రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.