News November 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
Similar News
News October 31, 2025
ఖమ్మం: టీచర్‌గా మారిన కలెక్టర్ అనుదీప్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన టీచర్‌గా మారి బోర్డుపై అక్షరాలు రాసి, విద్యార్థుల చదివే సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. 30 రోజుల్లో ఫలితాలు కనిపించాలని ఆయన ఆకాంక్షించారు.
News October 30, 2025
ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.
News October 30, 2025
నిబంధనలకు లోబడే లేఔట్ అనుమతులు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడారు. నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించి మాత్రమే లేఔట్ అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ప్రాంతంలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, సీవరేజ్, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. లేఔట్ అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.


