News December 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆}దమ్మపేట: పాఠశాల ఎదుట ఆందోళన∆} బయ్యారం: ధాన్యం కొనుగోలు సందర్శించిన ఎమ్మెల్యే∆} చర్ల: ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి దారుణ హత్య ∆}భద్రాద్రి జిల్లా: బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు∆}ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్∆}ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి∆} భద్రాచలం:అర్హులైన పేదలకు ఇందిరమ్మ:MLA∆} ఖమ్మం:’అంగన్వాడీలకు పెండింగ్ ఇంటి అద్దెలు ఇవ్వాలి’

Similar News

News December 3, 2025

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ

image

ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.

News December 3, 2025

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

image

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News December 3, 2025

పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.