News August 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంట పాటు వైద్య సేవలు బంద్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులు-3, సీహెచ్సీలు -11, పీహెచ్సీలు-59, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 600 వరకు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని చెప్పటంతో ఆ ప్రభావం ప్రభుత్వ దవాఖానాలపై పడనుంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీకి ముందు లేదా ఓపీ తర్వాత ఒక గంటపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News September 10, 2024

KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి

image

అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.

News September 10, 2024

ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు

image

ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.

News September 10, 2024

KMM: అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

image

ఖమ్మం జిల్లాలో SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు దరఖాస్తు ముగిసింది. ఇంటర్వ్యూకి తేదీలు ప్రకటించారు. 11న జరగనున్న ఇంగ్లిష్-1,హిస్టరీ-3,ఎకనామిక్స్-1 గణితం-3, బోటనీ-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-3,BCA-1,డేటా సైన్స్-1,బయో టెక్నాలజీ-1,12తేదీన జరగనున్న ఇంటర్వ్యూ కామర్స్-2, పొలిటికల్ సైన్స్-2,BBA-2 ఓ ప్రకటనలో ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు.