News October 20, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

> వైరాలో మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమీక్ష సమావేశం > ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల పర్యటన > వైరాలో ఉచిత వైద్య శిబిరం > సత్తుపల్లిలో సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం > కొత్తగూడెంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం ఇల్లెందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం > దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి> మణుగూరులో ఎమ్మెల్యే పర్యటన
Similar News
News November 17, 2025
పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.