News November 28, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన
Similar News
News December 8, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
News December 8, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలి: డీఈఓ
మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్‌లు పాల్గొన్నారు.
News December 8, 2024
నార్వారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్వారిగూడెం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అశ్వారావుపేట అస్పత్రికి తరలించారు.