News December 5, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొనిజర్లలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పినపాక లో ఎమ్మెల్యే పాయం పర్యటన
Similar News
News January 24, 2025
వేసవిలో నిరంతర విద్యుత్‌కు చర్యలు: Dy.CM భట్టి
రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ప్రజాభవన్‌లో విద్యుత్ అధికారులతో నిర్వహించిన 2025 యాక్షన్ ప్లాన్‌లో Dy.CM మాట్లాడారు. జిల్లా, మండల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఆ విధంగా సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 24, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలపై ఎంపీకి విన్నపం
టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలపై ఎంపీకి విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీన్జీవోస్ సభ్యులు పాల్గొన్నారు.
News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: పొంగులేటి
ప్రాథమిక లిస్టులో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేశవపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఓ పక్క అభివృద్ధితోపాటు మరోపక్క ప్రజలకు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు.