News December 6, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} తల్లాడలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} మణుగూరులో మంచి నీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
Similar News
News January 17, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా చేశారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News January 17, 2025
KMM: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
కూసుమంచి హైస్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ మండల కేంద్రానికి చెందిన విజయ్ హఠాత్తుగా కుప్పకూలి పోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించాడని, గుండెపోటే కారణమని వైద్యులు నిర్ధారించారు. తమతో ఆడుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా హఠాన్మరణం చెందడంతో మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.
News January 17, 2025
ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్‌ఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.