News December 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> కల్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> కొనిజర్ల మండలం సింగరాయపాలెంలో సిపిఎం పార్టీ డివిజన్ సమావేశం
> మధిరలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
> బోనకల్ లో వ్యవసాయశాఖ అధికారుల పర్యటన
> కొనసాగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడలు
> ముదిగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక సర్వే
> తల్లాడ మండలం నారాయణపురంలో చండీయాగం
> ఇల్లందులో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం

Similar News

News July 10, 2025

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు: అ.కలెక్టర్

image

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య రైతులకు బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు, ఇతర సదుపాయాల కల్పనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

News July 10, 2025

ఖమ్మం శివారులో యాక్సిడెంట్

image

బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలైన ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్‌పై ఖమ్మం వైపు వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News July 10, 2025

ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

image

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.