News December 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

> మధిరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాక > ఈర్లపుడిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన > ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన > కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే కనకయ్య > వేంసూరులో ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై తహశీల్దార్ ప్రత్యేక సమావేశం > ఖమ్మంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
Similar News
News October 16, 2025
KMM: ఆర్థిక సమస్యలు.. యువకుల సూసైడ్ అటెంప్ట్

ఎర్రుపాలెం మండలం ములుగుమాడుకి చెందిన స్నేహితులు ఆముదాల రాము, షేక్ జానీ ఆర్థిక సమస్యల కారణంగా బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో రాము పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. జానీకి మధిరలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
News October 16, 2025
ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 16, 2025
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం: సీపీ

ఫ్లాగ్ డేను పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు, 3 ని.లు గల షార్ట్ ఫిలిమ్స్ తీయాలని చెప్పారు. ఈనెల 22లోపు పోలీస్ కమిషనరేట్లో షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, ఫొటోలు అందజేయాలన్నారు.