News April 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✓నేలకొండపల్లిలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
Similar News
News January 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి: ఖమ్మం కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్, దోబీ మిషనరీస్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు.
News January 22, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా: సీపీ
ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన కమిటీ ఇటీవల నియామకమైంది. నూతన సభ్యులు ఖమ్మం సీపీ సునీల్ దత్‌ని కమిషనరేట్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారంలో తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
News January 22, 2025
కన్నులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.