News May 12, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

Similar News

News February 18, 2025

గంగారంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం గంగారంలోని జలగం నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచి రాధాకృష్ణ (30) గ్రామంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రాధాకృష్ణ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

image

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

News February 18, 2025

ఖమ్మం – సూర్యాపేట హైవే పై రోడ్డు ప్రమాదం

image

కూసుమంచి మండలంలో  ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్‌‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

error: Content is protected !!