News May 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన

Similar News

News October 3, 2024

ఖమ్మం: గాలి వాన బీభత్సం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేలకొండపల్లి మండలం బైరంపల్లిలో పెద్ద గాలికి చెట్టు విరిగి గేదెపై పడింది. అనాసాగరం- పమ్మి శివారులో భారీ వృక్షం పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

News October 3, 2024

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి(2025-26) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7వ తేదీ అన్నారు. 01-05-2013 నుండి 31-07-2015 జన్మించి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 18-01-2025 న ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

News October 2, 2024

రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్‌ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.