News June 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> బోనకల్లో సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు
> తల్లాడలో కౌలు రైతు సంఘం మండల కమిటీ సమావేశం
> అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> సత్తుపల్లిలో ఏరువాక కార్యక్రమం
> ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటన
> ఖమ్మం జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> మధిరలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
> నీట్ పరీక్షను రద్దు చేయాలని కొత్తగూడెంలో ఎస్ఎఫ్ఐ నిరసన

Similar News

News September 10, 2024

భద్రాచలం: జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం

image

వరద ప్రభావిత ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్తో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాల గురించి మాట్లాడారు. 2వ ప్రమాద హెచ్చరికకు గోదావరి వరద ప్రవాహం దగ్గర్లో ఉండడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.

News September 10, 2024

భద్రాచలం: గోదావరి నీటిమట్టం 47.1 అడుగులు

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని సీడబ్ల్యుసీ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నాటికి గోదావరి నీటి మట్టం 47.1 అడుగులకు చేరిందని వెల్లడించారు. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 47.1 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు కావడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News September 10, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.