News July 13, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

> నేటి నుంచి సింగరేణి ప్యాసింజర్ రైలు పున: ప్రారంభం > ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు > చింతకాని మండలంతో సీపీఎం నేత రామ నరసయ్య సంస్కరణ సభ > ఖమ్మంలో ప్రజానాట్యమండలి శిక్షణా తరగతులు > గోదావరి వరదపై ఉన్నతాధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష > మణుగూరులో సింగరేణి పరిరక్షణకై కార్మికుల దీక్షలు
Similar News
News November 26, 2025
ఖమ్మం: పార్టీల మద్దతు కోసం ఆశావాహుల క్యూ

ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పార్టీల సింబల్స్ లేకుండానే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పార్టీల మద్దతు కోరుతూ ఆశావాహులు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకుల వద్దకు క్యూ కడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన సేవను గుర్తుచేస్తూ, పార్టీల సపోర్ట్ ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయని భావించి, అభ్యర్థులు బలపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News November 26, 2025
ఖమ్మం: కూటమిగా ఉండేందుకు సన్నాహాలు

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయా పార్టీల స్థానిక నేతలు కూడా కూటమిగా బరిలో దిగాలని మంతనాలు చేస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ ఓటింగ్ క్రాస్ కాగా ప్రస్తుతము టీడీపీ కూటమిలో ఉండటంతో తెలంగాణ అధిష్ఠానం ఆదేశాలు కోసం ఎదురు చూస్తున్నారట.
News November 26, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఎదురు చూపులు

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరిపి కాటాలు వేసినా రవాణాకు ట్రాక్టర్లు, లారీలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మిల్లర్ల వద్ద అన్లోడింగ్ సమస్యలు ఉండటంతో వాహన యజమానులు రవాణాకు నిరాకరిస్తున్నారు. కల్లూరు మండలంలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ట్రాన్స్పోర్ట్ సమస్య తీవ్రంగా మారిందని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


