News September 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} నేటి నుంచి పోలీసులకు ఫైరింగ్ శిక్షణ
∆} బూర్గంపహాడ్‌లో అఖిలపక్ష సమావేశం
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

Similar News

News October 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News October 15, 2024

KMM: పెద్దపులి సంచారం.. జర జాగ్రత్త..!

image

జూలూరుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుందన్నవిషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. పాదముద్రలను గుర్తించి, 90 శాతం పెద్ద పులి అడుగులను పోలి ఉన్నాయని తేల్చి చెప్పారు. రైతులు ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదని అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా 4 రోజుల క్రితం ఓ శునకాన్ని పులి చంపేసిందని రైతులు తెలిపారు.  

News October 14, 2024

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్గో ఏజెంట్లకు ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఉన్న అశ్వాపురం, బయ్యారం క్రాస్ రోడ్, సుజాతనగర్, జూలూరుపాడు, నేలకొండపల్లి, కొణిజర్ల, దమ్మపేటలో TGSRTC లాజిస్టిక్ కేంద్రాలను నడుపుటకు ఏజెంట్లను ఆహ్వానిస్తున్నట్లు కార్గో ATM పవన్ కుమార్ తెలిపారు. ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ కంప్యూటర్ ప్రింటర్, వెయింగ్ మెషీన్ ఉన్నవారు అర్హులు అని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.