News January 5, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 17, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారీ కూలీలు చలి తీవ్రత కారణంగా వణుకుతూ పయనమయ్యారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2025

కూసుమంచి గణపేశ్వరాలయం చరిత్ర ఇదే..!

image

కూసుమంచి గణపేశ్వరాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 11-12వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ప్రతి శివరాత్రికి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

News January 20, 2025

ఖమ్మంలో యువకుడి మృతి..హత్యా? ఆత్మహత్యా..?

image

ఖమ్మంలోని పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన<<15158548>> సంజయ్ కుమార్<<>>(22) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సంజయ్ మృతిపై తల్లి మాట్లాడుతూ.. బాడీలో మోకాళ్లు దెబ్బతిన్నాయని, గొంతు లోపల రక్తం వచ్చిందని ఏం జరిగిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెట్టింగ్, ప్రేమ ఎలాంటి వ్యవహారాలు లేవని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.

News January 20, 2025

నేటితో ముగియనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

image

భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31న వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 20 రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు అవతారాల్లో రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. జనవరి 26న విశ్వరూప సేవ ఉంటుంది. ఈ సేవ కేవలం భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం.