News April 5, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్లాస్టిక్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలతో ప్రమాదం పొంచి ఉన్నా.. ఆయా జిల్లాల పుర అధికారులు నియంత్రించడం లేదు. చట్ట ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదు. గత సంవత్సరం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలనను గాలికి వదిలేశారు.
Similar News
News January 20, 2025
ఇల్లందు: గుండెపోటుతో స్కూల్‌లోనే టీచర్ మృతి
ఇల్లందులోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం పాఠశాలలో విధులకు హాజరైన ఆయన ఛాతీలో విపరీతమైన నొప్పి రావడంతో కుప్పకూలాడని సిబ్బంది తెలిపారు. అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. రమేశ్ మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News January 20, 2025
కూసుమంచి గణపేశ్వరాలయం చరిత్ర ఇదే..!
కూసుమంచి గణపేశ్వరాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 11-12వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ప్రతి శివరాత్రికి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
News January 20, 2025
ఖమ్మంలో యువకుడి మృతి..హత్యా? ఆత్మహత్యా..?
ఖమ్మంలోని పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన<<15158548>> సంజయ్ కుమార్<<>>(22) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సంజయ్ మృతిపై తల్లి మాట్లాడుతూ.. బాడీలో మోకాళ్లు దెబ్బతిన్నాయని, గొంతు లోపల రక్తం వచ్చిందని ఏం జరిగిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెట్టింగ్, ప్రేమ ఎలాంటి వ్యవహారాలు లేవని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.