News March 9, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News

News April 13, 2026

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్‌లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు 20వరకు అవకాశం

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.