News August 27, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,313 టన్నుల యూరియా దిగుమతి
ఖమ్మంకు రైల్వే వ్యాగన్ల ద్వారా సోమవారం
1,313 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన ఈ యూరియాను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదాంలకు ఇక్కడ నుంచి లారీల్లో పంపించారు. భద్రాద్రి జిల్లాకు 700 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాకు 313, మహబూబాబాద్ జిల్లాకు 300 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపించామని అధికారులు తెలిపారు.
Similar News
News September 16, 2024
దారుణం.. 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలికతో కలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
News September 16, 2024
సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి
ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. బుగ్గపాడు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ వద్దకు ఈతకు వెళ్లిన జితేంద్ర సాయి (4వ తరగతి), శశాంక్ (3వ తరగతి) ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News September 16, 2024
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన కరుణ, సహనం, సమైక్యత, సామరస్యం, విశ్వ మానవ సోదర భావం.. నిత్యం మనందరిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటాయని, అందరి మేలు కోసం పని చేసేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజని పేర్కొన్నారు.