News April 9, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJP పాగా వేసేనా?

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై గురి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వారు దూకుడు పెంచారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లోనూ గతంలో కంటే మెరుగైన ఓట్ల శాతం రాబట్టింది. ఎంత వరకు విజయం వరిస్తుందో చూడాలి. దీనిపై మీ కామెంట్..
Similar News
News December 2, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మణపల్లి 12.8°C, డోంగ్లి 13, గాంధారి 13.1, నస్రుల్లాబాద్ 13.2, జుక్కల్, బీబీపేట్, మేనూర్, బీర్కూర్ 13.3, బొమ్మన్ దేవిపల్లి 13.5, పెద్ద కొడప్గల్,సర్వాపూర్, పుల్కల్ 13.7, బిచ్కుంద 14, రామారెడ్డి 14.2, లచ్చపేట 14.4, మాక్దూంపూర్ 14.5, పిట్లం 14.6°C.
News December 2, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News December 2, 2025
ధరలు డబుల్.. దానిమ్మ రైతులకు గోల్డెన్ టైం!

అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి. ప్రస్తుతం టన్ను ఏకంగా ₹లక్ష పలుకుతోంది. జిల్లాలో 13,381 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. తాడిపత్రి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, యాడికి తదితర మండలాల్లో అధికంగా సాగుచేశారు. 3 నెలల క్రితం టన్ను రూ.50-60 వేల వరకు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఇతర రాష్ట్రాలో దిగుబడి ఆలస్యం కావడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.


