News October 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

Similar News

News November 1, 2024

 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తుమ్మల భేటీ

image

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ కు సంబంధించి అంశంపై చర్చించారు. వచ్చే పంట కాలం లోపల నీరు వచ్చే విధంగా పనులు ప్రారంభించి సత్తుపల్లికి నీరు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. కావాల్సిన భూ సేకరణ, ఇతర పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

News November 1, 2024

కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే సహించేది లేదు: మంత్రి తుమ్మల

image

రాష్ట్ర సచివాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్, మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాట్సాప్ (8897281111) ద్వారా రైతులు సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవకతవకలు జరిగితే సహించేది లేదని తుమ్మల హెచ్చరించారు. 

News November 1, 2024

మధిర: లారీ డ్రైవర్‌పై ట్రాన్స్‌జెండర్స్ దాడి.. SI కౌన్సిలింగ్

image

మధిరలో గురువారం రాత్రి ట్రాన్స్‌జెండర్స్ లారీ డ్రైవర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. మధిర ఎస్ఐ సంధ్య ఈరోజు ఉదయం వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు.