News March 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

Similar News

News February 17, 2026

సన్న వడ్ల బోనస్ జమ: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64,093 మంది రైతులకు మొత్తం రూ.175.69 కోట్లు బోనస్‌గా అందజేశామని వెల్లడించారు. మద్దతు ధరతో పాటు ఈ అదనపు బోనస్ చెల్లింపు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

News February 17, 2026

GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

image

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 17, 2026

ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.