News April 3, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం
∆} పదో తరగతి పేపర్ల మూల్యకలనం
∆} కూసుమంచి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
Similar News
News February 9, 2026
ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనకు ముమ్మర సర్వే

ఖమ్మం జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు వైద్యశాఖ రెండో విడత ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 13 వరకు ఆశా కార్యకర్తలు అనుమానితులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తారు. ఈ ఏడాది కొత్తగా 74 కేసులు నమోదయ్యాయి. శరీరముపై స్పర్శ లేని మచ్చలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు తెలిపారు
News February 9, 2026
మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంగా జరగాల్సిన డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కోఆర్డినేటర్ వీరన్న తెలిపారు. ఎన్నికల విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
News February 9, 2026
పందిళ్లపల్లికి యూరియా రాక.. మూడు జిల్లాలకు కేటాయింపు

రైతులకు ఊరటనిస్తూ పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం యూరియా చేరుకుంది. క్రిబ్కో కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల ఎరువులు రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చినట్లు ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,246 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 500, మహబూబాబాద్‌కు 700 టన్నుల యూరియాను కేటాయించారు. మిగిలిన 200 టన్నులను అత్యవసర అవసరాల కోసం బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.


